భారత్లో గత కొన్నేళ్లలో సింహాల సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ధైర్యానికి సింహం నిదర్శనం అని, ఆసియా సింహాలకు నిలయంగా ఉన్నందున భారత్ గర్విస్తోందని మోదీ ట్వీట్ చేశారు.
"ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా.. వాటి సంరక్షణ కోసం పాటుపడేవారందరికీ నా అభినందనలు. గత కొన్నేళ్లలో భారత్లో సింహాల సంఖ్య క్రమంగా పెరిగింది."