భారత్లో రూ.వేల కోట్ల కుంభకోణాలు, బ్యాంకు మోసాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను(fugitive economic offenders india) తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు(PM Modi latest news). దౌత్యపరమైన చర్చలు సహా అన్ని రకాలుగా వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాళ్లకు మరో గత్యంతరం లేదని, ఇక్కడకు రాక తప్పదని స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహించిన 'బిల్డ్ సినర్జీ ఫర్ సీమ్లెస్ క్రెడిట్ ఫ్లో అండ్ ఎకానమిక్ గ్రోత్' సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రత్యేకించి ఎవరి పేరునూ ప్రస్తావించలేదు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి హై ప్రొఫైల్ ఆర్థిక నేరగాళ్లను స్వదేశం తీసుకొచ్చేందుకు ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
రూ.5లక్షల కోట్లకు పైగా రికవరీ..
గత 6-7 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా దేశంలో బ్యాంకింగ్ రంగం ఇప్పుడు పటిష్ఠ స్థితిలో ఉందని ఈ సదస్సులో మోదీ అన్నారు(pm modi latest news). బ్యాంకులు ఆర్థికంగా చాలా మెరుగయ్యాయని వివరించారు. లోన్ల రికవరీకి తీసుకున్న చర్యల వల్ల ఒత్తిడికి గురైన రుణాల నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్లకుపైగా రికవరీ చేశాయని వెల్లడించారు. నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(NARCL) ద్వారా మరో రూ.2 లక్షల కోట్ల ఆస్తులు పరిష్కారమవుతాయన్నారు. (modi news today).