కొవిడ్ కారణంగా మానవత్వ సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. బుద్ధుడి బోధనలు ఎంతో అనుసరణీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుద్దుడి మార్గాలను అనుసరిస్తూ.. క్లిష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో భారత్ నిరూపించిందని తెలిపారు. ఆషాఢ పూర్ణిమ, ధర్మచక్ర కార్యక్రమం సందర్భంగా.. ప్రజలకు మోదీ శనివారం తన సందేశాన్ని ఇచ్చారు. విషాద సమయాల్లో. బుద్ధుని బోధనల శక్తిని ప్రపంచం గ్రహించిందని పేర్కొన్నారు మోదీ.
"బుద్ధుని బోధనలను పాటిస్తూ ప్రపంచం సంఘీభావతత్వంతో పయనిస్తోంది. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కన్ఫెడరేషన్ చేపట్టిన ప్రార్థన సంరక్షణ విధానం ఎంతో విలువైనది. శత్రుత్వాన్ని శత్రుత్వం ద్వారా ఎదుర్కోలేం. ప్రేమ, పెద్ద మనసుతోనే దాన్ని ఓడించగలం. విషాద సమయాల్లో ప్రపంచమంతా.. ప్రేమ, సామరస్యం శక్తిని గ్రహించింది. బుద్ధడు బోధించిన ఈ పాఠాల ద్వారా.. మానవత్వం సుసంపన్నమైంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి