తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ కంపెనీల్లో 40లక్షల ఉద్యోగాలు'.. 71వేల మందికి మోదీ అపాయింట్​మెంట్ లెటర్స్ - how many airports in india

'రోజ్​గార్ మేళా'లో భాగంగా 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ​ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. స్టార్టప్​లు దేశంలో 40 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించాయని అన్నారు.

pm modi rozgar mela
pm modi rozgar mela

By

Published : Apr 13, 2023, 1:22 PM IST

Updated : Apr 13, 2023, 2:19 PM IST

కేంద్రంలోని ఎన్డీఏ ​ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వేగంగా సాగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్టార్టప్​లు దేశంలో 40 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించాయని అన్నారు మోదీ. బుధవారం మధ్యప్రదేశ్​లో 22వేల మంది ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందజేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగిన జాతీయ రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 71 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. దేశంలో అమలు చేస్తున్న సరికొత్త విధానాలు, వ్యూహాలతో.. కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం సాంకేతికత, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోందని, గత ప్రభుత్వాలు అందుకు భిన్నంగా పనిచేశాయని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు.

భారత్‌.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. కరోనా తర్వాత ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రపంచమంతా భారత్‌ను వేగుచుక్కలా చూస్తున్నాయి. నేటి భారతం సరికొత్త విధానాలు, వ్యూహాలతో సాగుతోంది. ఫలితంగా దేశంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నాయి.

--నరేంద్ర మోదీ, ప్రధాని

ముద్రా పథకం.. ఎనిమిది కోట్ల మంది కొత్త పారిశ్రామితవేత్తలను సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. ముద్రా పథకాన్ని కొందరు అవహేళన చేశారని పరోక్షంగా కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా.. ప్రస్తుతం అవి 148కు చేరుకున్నాయని తెలిపారు. దీంతో భారీగా ఉద్యోగాల కల్పన పెరిగిందని మోదీ పేర్కొన్నారు.

"రోజ్‌గార్ మేళా.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది. యువతలో స్పూర్తిని నింపుతుంది. పవిత్ర బైశాఖీ పర్వదినాన 71 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. భారత్​ రూ. 15 వేల కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేసింది. దశాబ్దాలుగా రక్షణ రంగ పరికరాలను దిగుమతే చేసుకున్నాం. కానీ ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. నవ భారత యువత డ్రోన్ తయారీలో భాగమవుతున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు." అని మోదీ అన్నారు.

మరోవైపు.. రోజ్​గార్​ మేళా కింద ఉద్యోగులకు అపాయింట్​మెంట్ లెటర్లు ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. 'తక్కువ ఉద్యోగాలు.. చాలా ఆలస్యంగా ఇచ్చారు' అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు అవుతున్న సందర్భంలో ఇదొక స్టంట్​గా అభివర్ణించారు.

Last Updated : Apr 13, 2023, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details