'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'(ఓఎన్ఓఆర్సీ) పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనితో పాటు 37వ ప్రగతి సమావేశంలో భాగంగా... 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్‌లను మోదీ సమీక్షించారు. ఈ ప్రాజెక్టులపై అధికారులను వివరాలు అడిగి తెలుకున్నారు.
ఓఎన్ఓఆర్సీపై సమీక్షించిన మోదీ.. ఈ పథకం విస్తృత ప్రయోజనాలను ప్రజలకు అందించేలా చూడాలని అధికారులను కోరారు. ఇందుకుగానూ ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన సాంకేతిక ఫ్లాట్‌ఫాంలను ఉపయోగించుకోవాలని సూచించారు. సకాలంలో ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాల్సి అవసరాన్ని అధికారులకు వివరించారు ప్రధాని నరేంద్రమోదీ.
ప్రధానమంత్రి సమీక్షించిన ఎనిమిది ప్రాజెక్ట్‌ల్లో మూడు రైల్వే, మూడు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి కాగా మరో రెండు విద్యుత్ శాఖకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, మణిపూర్, దిల్లీల్లో ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.