దేశ సమగ్రతను కాపాడేందుకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషి మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం.. భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 68వ వర్ధంతి సందర్భంగా.. ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.
" శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప ఆలోచనలు, ప్రజలకు సేవ చేయాలన్న తపన.. ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం."
-- ప్రధాని నరేంద్ర మోదీ
షా నివాళులు..
శ్యామా ప్రసాద్ ముఖర్జీకి కేంద్ర హోం మంత్రి.. అమిత్ షా నివాళులు అర్పించారు.
" దేశ గుర్తింపు, సమగ్రతను ముఖర్జీ కాపాడారు. ఆయన సాంస్కృతిక భారత్ సిద్ధాంతకర్త. ప్రజల సహకారం లేనిది దేశం అభివృద్ధి చెందదని ముఖర్జీ నమ్మకం."
-- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
నడ్డా నివాళులు..
శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. అధికరణ 370, 35ఏను రద్దు చేసేందుకు ముఖర్జీ.. ఓ ఉద్యమాన్నే ప్రారంభించారని నడ్డా తెలిపారు. దేశ సమగ్రత, కశ్మీర్ కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.
కేంద్ర మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్ కూడా ట్విట్టర్ ద్వారా శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి:Congress: ప్రధానితో భేటీకి కాంగ్రెస్ సిద్ధం