తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతి ​భవన్​లో డెన్మార్క్​ ప్రధానికి మోదీ స్వాగతం - మెట్టె ఫ్రెడరిక్సన్‌ను ఆహ్వానించిన మోదీ

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ పిలుపు మేరకు డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్​ భారత్​కు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్​లో ఆమెను ప్రభుత్వ లాంఛనాలతో ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/09-October-2021/13304842_pm4.JPG
డెన్మార్క్​ ప్రధానికి మోదీ స్వాగతం

By

Published : Oct 9, 2021, 11:00 AM IST

Updated : Oct 9, 2021, 12:21 PM IST

రాష్ట్రపతి భవన్​లో డెన్మార్క్​ ప్రధానికి మోదీ స్వాగతం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపు మేరకు భారత్‌కు విచ్చేసిన డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్‌కు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ఆమెను ప్రభుత్వ లాంఛనాలతో మోదీ సాదరంగా ఆహ్వానించారు. మూడు రోజులపాటు ఆమె భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో చర్చించనున్నారు.

డెన్మార్క్​ ప్రధానికి అభివాదం చేస్తున్న మోదీ
మెట్టె ఫ్రెడరిక్సన్​తో మోదీ
రాజ్​ఘాట్​లో మహాత్ముడికి నివాళ్లు అర్పిస్తున్న మెట్టె ఫ్రెడరిక్సన్​

మరోవైపు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముడి స్మారకాన్ని దర్శించిన డెన్మార్క్‌ ప్రధాని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. భారత్‌ తమ మిత్రదేశంగా ఫ్రెడరిక్సన్​ పేర్కొన్నారు. ఈ పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఓ మైలురాయిగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్​ నాయకత్వంలో..

తమ దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వాతావరణ మార్పులను కట్టడి చేయటంలో నాయకత్వం వహించేందుకు భారత్​ ఆసక్తిగా ఉందని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ పేర్కొన్నారు. త్వరలో గ్రాస్​గౌ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈమేరకు ఆమె వ్యాఖ్యానించారు.

"గతేడాది ప్రధాని మోదీ, నేను హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంపై సంతకాలు చేశాం. ఈ ఒప్పందంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మరికొద్ది వారాల తర్వాత కాప్​26 గ్లాస్​గౌ సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాలకు వాతావరణ మార్పుల కట్టడిలో ఎలా సహకారం అందించాలన్నదానిపై ఈ భేటీని వినియోగించుకుంటాం"అని మెట్టె ఫ్రెడరిక్సన్ చెప్పారు.

ఇదీ చూడండి:జపాన్​ నూతన ప్రధానికి నరేంద్ర మోదీ ఫోన్​

Last Updated : Oct 9, 2021, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details