లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రశంసల కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ ప్రజాస్వామ్యం, పనితీరును ఆయన మరింత మెరుగుపరిచారని కొనియాడారు. స్పీకర్గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిర్లాకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
స్పీకర్ ఓం బిర్లా హయాంలో పార్లమెంటు పనితీరు మరింత మెరుగుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కొనియాడరు. సభాపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిర్లాకు అభినందనలు తెలిపారు. ఆయన తీసుకున్న చర్యల కారణంగానే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతమైందని, సభ ఉత్పాదకత పెరిగిందని ప్రశంసించారు. ఫలితంగా ఎన్నో చారిత్రక బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయన్నారు.