తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం' - vice president of india

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతం అని కొనియాడారు.

pm modi pays tributes
'దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం'

By

Published : Jun 28, 2021, 10:08 AM IST

Updated : Jun 28, 2021, 10:16 AM IST

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి( జూన్​ 28) సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అసాధారణమైన ప్రతిభ సొంతం అన్నారు. గతంలో మన్​కీబాత్​లో పీవీకి గురించి మాట్లాడిన వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశారు మోదీ.

వెంకయ్య నివాళులు..

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

"బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నా. స్వావలంబన, స్వయం సమృద్ధికి పీవీ పెద్దపీట వేశారు. దేశ భవిష్యత్తుకు పీవీ బాటలు పరిచారు. మాతృభాషకు పీవీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. పీవీ సేవలను జాతి చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది."

-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

పీవీ.. రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని వెంకయ్య కొనియాడారు.

ఇదీ చదవండి :నవ భారత నిర్మాత.. భాగ్యవిధాత!

Pv narasimha rao: నేటితో ముగియనున్న పీవీ శతజయంతి ఉత్సవాలు

Last Updated : Jun 28, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details