తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఠాగూర్, గోఖలే జయంతి- మోదీ నివాళులు - మహారాణా ప్రతాప్​కు మోదీ నివాళి

రవీంద్రనాథ్​ ఠాగూర్ 160 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గోపాల కృష్ణ గోఖలే, మహారాణా ప్రతాప్​లకూ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.

Narendra modi
నరేంద్ర మోదీ, ప్రధాని మోదీ

By

Published : May 9, 2021, 11:23 AM IST

Updated : May 9, 2021, 11:56 AM IST

నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్​ 160వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్య్ర సమరయోధుడు గోపాల కృష్ణ గోఖలే, మహారాణా ప్రతాప్​లకూ మోదీ నివాళులర్పించారు.

ఠాగూర్ ఆలోచనలు దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. ఆయన కలలు కన్న భారతంగా దేశాన్ని తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, దేశసేవ కోసం గోఖలే తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ పేర్కొన్నారు.

మోదీ ట్వీట్

మాహారాణా ప్రతాప్.. తన ధైర్యసాహసాలతో దేశానికి కీర్తి తెచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. జన్మభూమికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని తెలిపారు.

ఠాగూర్ జన్మదినం మే 7 అయినప్పటికీ ఆయన జయంతిని బెంగాలీల​ క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:అసోం సీఎంగా హిమంత- రేపే ప్రమాణం!

Last Updated : May 9, 2021, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details