తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vijay Diwas 2021: అమర వీరులకు అగ్రనేతల నివాళులు - PM Modi

కార్గిల్​ విజయ్​ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల ప్రాణ త్యాగాలు దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని.. వారి వీరోచిత పోరాటాలు ప్రతిరోజూ స్ఫూర్తిని కలిగిస్తాయని మోదీ అన్నారు.

Vijay Diwas
విజయ్​ దివస్

By

Published : Jul 26, 2021, 10:02 AM IST

Updated : Jul 26, 2021, 10:40 AM IST

కార్గిల్​ విజయ్​ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్​ నివాళులు అర్పించారు. కశ్మీర్​ ద్రాస్​లోని అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించి.. నివాళులు అర్పించాలని మొదట నిర్ణయించినా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆయన పర్యటన రద్దయింది. దీంతో.. బారాముల్లాలోని యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి నివాళులు అర్పించారు.

ప్రతిరోజూ స్ఫూర్తి..

ప్రధాని మోదీ ట్వీట్​

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమర జవాన్లకు నివాళులు అర్పించారు. యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన సైనికులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని మోదీ అన్నారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. జవాన్ల వీరోచిత పోరాటాలు ప్రతిరోజూ స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు.

వెంకయ్య నివాళి

వెంకయ్యనాయుడు ట్వీట్​

1999 భారత్​, పాకిస్థాన్​ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కార్గిల్ హీరోలకు​ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదన్నారు.

హృదయపూర్వక నివాళి..

రాహుల్ గాంధీ ట్వీట్

కార్గిల్ హీరోలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. కార్గిల్​ విజయ్​ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా ​ వీరులకు హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. దేశ త్రివర్ణపతాక గౌరవాన్ని.. సైనికులు నలుదిశలా చాటారని కొనియాడారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదన్నారు.

రాజ్​నాథ్​సింగ్​ నివాళులు

అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న రాజ్​నాథ్ సింగ్​
అమరవీరులకు సెల్యూట్ చేస్తూ..

కార్గిల్​ విజయ్​ దివస్(Vijay Diwas 2021)​ సందర్భంగా.. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. అమరవీరులకు నివాళులు అర్పించారు. దిల్లీలోని జాతీయ స్మారకానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి సెల్యూట్​ చేశారు.

సైనికాధికారుల నివాళులు

బిపిన్​ రావత్​ నివాళులు
సైనిక కవాతుతో నివాళులు
సైనికాధికారుల నివాళులు

త్రిదళాధిపతి బిపిన్ రావత్​.. కార్గిల్​ విజయ్ దివస్(Vijay Diwas 2021)​ సందర్భంగా కశ్మీర్​ ద్రాస్​లోని అమరవీరుల స్మారక చిహ్నానికి.. నివాళులు అర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్​ ఎంఎం. నరవాణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ బదౌరియా, నేవీ వైస్​ చీఫ్ జీ.అశోక్ కుమార్​.. నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:గవర్నర్​ను కలవనున్న యడ్డీ- రాజీనామా కోసమేనా?

Last Updated : Jul 26, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details