షహీద్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు త్రయానికి నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని మంగళవారం ట్వీట్ చేశారు.
"స్వాతంత్ర్య విప్లవకారులైన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వర్ధంతి సందర్భంగా వారికి నా వందనాలు. భరతమాత కుమారులైన వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయి. జై హింద్."
-నరేంద్ర మోదీ, ప్రధాని