రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
" బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఉపరాష్ట్రపతి నివాళి
బాబాసాహెబ్‌కు వెంకయ్య నివాళి అంబేడ్కర్‌కు వెంకయ్య నివాళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుష్పగుచ్ఛాలతో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
రాహుల్ నివాళి..
అంబేడ్కర్‌కు రాహుల్ నివాళి భారతరత్న డాక్టర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అంబేడ్కర్ సంధించిన క్లిష్టమైన ప్రశ్నలు.. దేశం ప్రగతిపథంలో నడిచేందుకు సహాయపడ్డాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇదీ చదవండి :'అంబేడ్కర్ స్ఫూర్తితో శక్తిమంతమైన భారత్'