మహిళలు సాధికారత సాధిస్తే.. కుటుంబంతో పాటు సమాజం బాగుపడుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్' కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) చెందిన మహిళలతో మోదీ ముచ్చటించారు.
"మహిళా సాధికారతతో కుటుంబం మాత్రమే కాదు.. సమాజం మొత్తం బాగుపడుతుంది. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. వారి కృషికి తగిన గుర్తింపు ఇవ్వడం సహా మహిళలు.. తమ శక్తి, సామర్థ్యాలతో ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరు."