కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. వారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకగా ఉండేవారని.. భాజపా నేతలు కొనియాడారు. ప్రతి సమస్యపై అవగాహన కలిగి ఉండేవారని.. దేశ రాజకీయాల్లో జైట్లీకున్న అపార అనుభవంతోనే ఇది సాధ్యమైందని కీర్తించారు.
1952 డిసెంబర్ 28న జన్మించిన అరుణ్ జైట్లీ 2019 ఆగస్టులో మరణించారు.
నా మిత్రుడు, అరుణ్ జైట్లీ మనమధ్య లేకపోవడం బాధాకరం. వ్యక్తిగతంగా ఆయనతో నాకున్న సాన్నిహిత్యం మరువలేనిది. ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు, అపార జ్ఞాని. అనునిత్యం దేశ ప్రగతికి పాటుపడ్డారు.
-మోదీ ట్వీట్