భారత్కు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీలో శతాబ్దాల అనుభవం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొలి రెండు ప్రపంచ యుద్ధ సమయాల్లో దేశం భారీఎత్తున ఆయుధాలను సరఫరా చేసిందన్న ఆయన.. ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. స్వాతంత్ర్యానంతం దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రతి ఆయుధం కోసం చిన్న దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం.. భారత్ రక్షణ రంగ వ్యవస్థలో అతిపెద్ద దిగుమతిదారుగా నిలుస్తోందన్నారు.
'100 రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు' - నరేంద్ర మోదీ
గతంలో భారీ ఆయుధాలను తయారు చేసిన భారత్.. ప్రస్తుతం ఆ విషయంలో చిన్న దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు కేంద్రం.. వంద రక్షణ వస్తువుల దిగుమతిపై ఆంక్షలు విధిస్తూ జాబితాను రూపొందించిందని బడ్జెట్లో రక్షణ రంగానికి చెందిన అంశాల గురించి చెప్పారు.
అయితే.. ఈ స్థితి నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వివరించారు మోదీ. భారత్.. తన శక్తి, సామర్థ్యాలను త్వరితగతిన పెంచుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు కేంద్రం.. వంద రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై ఆంక్షలు విధిస్తూ జాబితాను రూపొందించిందని బడ్జెట్లో రక్షణ రంగానికి చెందిన అంశాలపై మాట్లాడారు. 'ఆత్మనిర్భర్ భారత్'తో దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరగడం సహా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఫలితంగా ఇతర దేశాలపై ఆధారపడే అవసరముండదని మోదీ తెలిపారు.
ఇదీ చదవండి:'రైతుల మేలు కోసమే సాగు చట్టాలు'