తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ రక్షణకు సైబర్​ భద్రతే కీలకం'

PM Modi on Defence Sector: దేశ రక్షణకు సైబర్​ భద్రతే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలీయమైన సమాచార సాంకేతిక (ఐటీ) రంగమే భారత్​ బలమన్న మోదీ.. రక్షణ వ్యవస్థలో ఐటీ పరిజ్ఞాన వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. రక్షణ మంత్రిత్వ శాఖ పోస్ట్​-బడ్జెట్​ వెబినార్‌లో పాల్గొన్న మోదీ.. రక్షణ దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi on defence sector
PM Modi on defence sector

By

Published : Feb 25, 2022, 2:14 PM IST

PM Modi on Defence Sector: దేశ రక్షణలో సైబర్​ భద్రత కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైబర్​ భద్రత కేవలం డిజిటల్​ ప్రపంచానికే పరిమితం కాలేదని.. ప్రస్తుతం జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిందన్నారు. బలీయమైన దేశ సమాచార సాంకేతిక(ఐటీ) పరిజ్ఞానమే భారత్​ బలమన్న మోదీ.. దీనిని రక్షణ వ్యవస్థలో మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఐటీ పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో ఎంత వినియోగించుకుంటే భద్రతాపరంగా అంత ధీమాగా ఉండగలమని మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ మంత్రిత్వ శాఖ పోస్ట్​-బడ్జెట్​ వెబినార్‌లో పాల్గొన్న మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌లో 70 శాతం దేశీయ పరిశ్రమలకే కేటాయించామన్న మోదీ.. గత ఐదారేళ్లుగా రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు తెలిపారు. మేక్​ ఇన్​ఇండియాలో భాగంగా దేశంలో తయారవుతున్న రక్షణ పరికరాలను 75 దేశాలకుపైగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

గ‌తేడాది ఏడు కొత్త ఆయుధ తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేశామ‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు. ప్రస్తుతం అవి సమర్థంగా పని చేస్తున్నాయని, తద్వారా ప్రపంచ దేశాలకు మరిన్ని ఆయుధాలు ఎగుమతి దిశగా సాగుతున్నాయని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా'కు ప్రభుత్వ ప్రోత్సాహానికి అనుగుణంగా గత ఏడేళ్లలో రక్షణ పరికరాల తయారీకి 350కి పైగా కొత్త పారిశ్రామిక లైసెన్సులు జారీ చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2001 నుంచి 2014 వరకు పద్నాలుగేళ్లలో 200 లైసెన్సులు మాత్రమే జారీ అయినట్లు ఆయన తెలిపారు.

'అదే పరిష్కారం'

ఈ క్రమంలోనే రక్షణ దిగుమతులపై మోదీ కీలక వ్యాఖ్యాలు చేశారు. రక్షణ పరికరాల దిగుమతి చేసుకునే ప్రక్రియ చాలా సుదీర్ఘకాలం సాగుతోందన్న మోదీ.. అవి మన భద్రతా బలగాలకు చేరుకునే సమయానికి వాటిలో చాలా వరకు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయన్నారు. అందుకు రక్షణ పరికరాలను దేశంలోనే తయారు చేయడం చక్కటి పరిష్కారమని ప్రధాని వ్యాఖ్యానించారు.

"బ్రిటీష్​ పాలనలో ఉన్నప్పుడు, స్వాతంత్య్ర వచ్చే నాటికి రక్షణ పరికరాల తయారీలో మనం దేశం ముందువరుసలో ఉండేది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆయుధాల తయారీలో భారత్​ కీలక పాత్ర పోషించింది. తర్వాత కొన్నేళ్లుగా పరిస్థితి మారుతూ వచ్చింది. అయితే భారత్‌ రక్షణ సామర్థ్యంలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు.. 55 అడుగుల లోతులో..

ABOUT THE AUTHOR

...view details