శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరాఖండ్‌లో (Modi in uttarakhand today) పర్యటించారు. ముందుగా ఈ ఉదయం దేహ్రాదూన్ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వాగతం పలికారు.
అక్కడినుంచి.. నేరుగా కేదార్నాథ్ వెళ్లిన మోదీ (Modi kedarnath visit) ఆలయంలో కలియతిరిగారు. అనంతరం.. ప్రత్యేక పూజలు(Kedarnath temple) నిర్వహించారు. మహాశివుడికి నమస్కరించి.. హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ..
తర్వాత ఆది శంకరాచార్య సమాధి స్థల్‌ను (Shankaracharya samadhi) ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019లో చేపట్టిన 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువుగల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదిశంకరాచార్యుల రచనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయని మోదీ అన్నారు.
''మహనీయుల చరిత్రను మనం మననం చేసుకుందాం. ఆదిశంకరాచార్యుల రచనలు ఐక్యతను గుర్తుచేస్తాయి. ఉపనిషత్తుల్లో కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయి. పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆధ్యాత్మిక చింతన చేకూరుతుంది. ఆదిశంకరాచార్య సమాధి స్థల్.. ఆధ్యాత్మిక శ్రేయస్సుకు అపూర్వ దృశ్యం. కేదార్‌నాథ్‌లో అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నా. 2013 విధ్వంసం తర్వాత.. మళ్లీ అభివృద్ధి సాధ్యమా అనుకున్నాం. ఇవాళ కేదార్‌నాథ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.