తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్.. మోదీ'

ప్రజాస్వామ్యయుతంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకొనే శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తప్ప మరొకరికి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మోదీ లాంటి శ్రోతను తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. పేదల కోసం మోదీ తీసుకున్నన్ని సంక్షేమ చర్యలు దేశంలో ఎవరూ చేపట్టలేదన్నారు.

amit shah
అమిత్ షా

By

Published : Oct 11, 2021, 7:02 AM IST

రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) లాంటి శ్రోతను తానెప్పుడూ చూడలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah News) పేర్కొన్నారు. మంచి చెడులను విని, ప్రజాస్వామ్యయుతంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకొనే శక్తి ఆయనకు తప్ప మరొకరికి లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నడూ లేనంత ప్రజాస్వామ్యయుతంగా కేంద్ర మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని షా(Amit Shah News) చెప్పారు. పేదల కోసం మోదీ తీసుకున్నన్ని సంక్షేమ చర్యలు కానీ, ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకు చేపట్టినన్ని సంస్కరణలు కానీ దేశంలో ఎవరూ తీసుకురాలేదన్నారు. ప్రభుత్వాధినేతగా మోదీ 20 ఏళ్లు పూర్తిచేసుకున్న (గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి) సందర్భంగా అమిత్‌షా(Amit Shah News) 'సంసద్‌ టీవీ'కి ప్రత్యేక ఇంటర్వ్యూ(Amit Shah Interview) ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు...

ఆయనలో స్వార్థం లేదు

"మోదీ నిర్ణయాలు ఏకపక్షమన్న ఆరోపణలు నిరాధారం. మిగతావారు చెప్పేదంతా సునిశితంగా విని, అంతిమంగా అత్యంత ధైర్యంగా ఆయన సముచిత నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆయన.. నిర్ణయాలను రుద్దే నాయకుడన్న వాదనల్లో పిసరంత నిజమూ లేదు. అధికారంలోకి వచ్చింది దేశాన్ని మార్చడానికి తప్పితే కేవలం ప్రభుత్వాన్ని నడపడానికి మాత్రమే కాదన్నది ఆయన ఉద్దేశం. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, ముమ్మారు తలాఖ్‌, ఒకే ర్యాంకు.. ఒకే పింఛన్‌, మెరుపుదాడుల నిర్వహణ, ఆర్టికల్‌ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలెన్నో తీసుకున్నారు. ఆయనలో స్వార్థం లేదు"

-అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి.

అదీ వామపక్షాల విధానం

"రైతులకు ఏటా రూ.1.50 లక్షల కోట్లను ప్రభుత్వం నేరుగా బదిలీ చేస్తోంది. చిన్న, సన్నకారు రైతులు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. మా పథకాలు చూసి మేం వామపక్షాల దారిలో వెళ్తున్నామనడానికి వీల్లేదు. వామపక్షాల విధానం పేదల అభ్యున్నతి కాదు. వారికి పేదలకు మేలు చేయాలన్న ఆకాంక్ష ఉండి ఉంటే బంగాల్‌, త్రిపుర పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు" అని అమిత్‌ షా(Amit Shah News) అన్నారు.

కొందరి రాజకీయాలకు కుటుంబమే సిద్ధాంతం

"విభిన్న సిద్ధాంతాలున్న నేతలు విజయవంతమైనప్పుడు మోదీ వారిని కూడా స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం తమ కుటుంబ వ్యక్తి కాకుండా మరొకరు ప్రధాని ఎలా అవుతారన్న భావనలో ఉన్నారు. వారికి కుటుంబమే సిద్ధాంతంగా మారింది. 3 వ్యవసాయ చట్టాలు కూడా మోదీ సంస్కరణల్లో భాగమే"

-అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి.

"మా వైఫల్యాలు ఉంటే ఎండగట్టండి. అంతేగానీ వ్యక్తిగత విమర్శలకు దిగి రాజకీయాల స్థాయిని దిగజార్చకండి" అని విపక్షాలకు అమిత్ షా(Amit Shah Interview) సూచించారు.

ఇవీ చూడండి:

Power Crisis: 'వదంతులు సృష్టిస్తూ.. విపక్షాల రాజకీయం!'

'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి'

ABOUT THE AUTHOR

...view details