PM Modi News: కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, బిహార్ సీఎం నితీశ్ కుమార్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరామర్శించారు. ఫోన్ ద్వారా ముఖ్యమంత్రులను పరామర్శించిన మోదీ.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మహమ్మారి నుంచి వేగంగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సాయంత్రం సుమారు 4.30 గంటలకు మోదీ బొమ్మైకు ఫోన్ చేశారని.. దాదాపు 5 నిమిషాలు ప్రధాని మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కూడా మోదీ ఆరా తీశారని.. మహమ్మారిని అదుపు చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు బొమ్మై స్పష్టం చేశారన్నారు.