pm Modi milk dairy opening: గుజరాత్‌లోని మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. బనాస్కాంఠాలో నూతన డెయిరీ ప్లాంట్‌తో పాటు బంగాళదుంపల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ డెయిరీలో రోజుకు 30 లక్షల లీటర్ల పాలు, సుమారు 80 టన్నుల వెన్న, లక్ష టన్నుల ఐస్‌క్రీం తయారవుతుంది. 20 టన్నుల కోవా, ఆరు టన్నుల చాక్లెట్ ఉత్పత్తి అవుతుంది.
పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్‌లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. చిన్న రైతులే.. పాడి పరిశ్రమ అతిపెద్ద లబ్ధిదారులని అన్నారు. సహకార డెయిరీ.. చిన్న రైతులను, మహిళలను, గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.
పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్‌లో తయారైన ఆహారోత్పత్తులను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ బనాస్ డెయిరీ ఆసియాలోని ప్రముఖ పాల ఉత్పత్తి తయారీ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సన్నకారు రైతులకు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్న సన్నకారు రైతుల బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. అందుకే సంవత్సరానికి రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అక్కడి మహిళలు తమ పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమతో పశువులను చూసుకుంటున్నారని మోదీ ప్రశంసించారు.
బనాస్ డెయిరీని ప్రారంభించిన మోదీ పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్‌లో.. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీ, ప్యాటీస్ మొదలైన ఉత్పత్తులు తయారవుతాయి. వీటిలో చాలా వరకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి.
ఇదీ చదవండి:4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్‌కు ఓకే.. కానీ...