Modi School Teacher: ప్రధాని మోదీ.. గుజరాత్ పర్యటనలో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన తన చిన్ననాటి పాఠశాల ఉపాధ్యాయుడిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో మోదీ కుటుంబం.. వడ్‌నగర్‌లో నివసించేటప్పుడు నాయక్ (88).. ప్రధానికి పాఠాలు చెప్పారు. "ఇది చాలా చిన్న సమావేశమే. కానీ వర్ణించటానికి మాటలు సరిపోవు. ఇన్నేళ్లు గడిచినా.. నా శిష్యుడు నాపై అదే గౌరవాన్ని చూపారు" అని నాయక్ తర్వాత విలేకరులతో తెలిపారు.
చిన్ననాటి గురువును కలిసిన మోదీ.. ఫోన్ చేసి మరీ! - మోదీ స్కూల్ టీజర్
Modi School Teacher: తన చిన్ననాటి పాఠశాల ఉపాధ్యాయుడిని కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. నవసారీలో నాయక్ అనే తన గురువును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
pm modi gujarat visit
నవసారీ పర్యటనకు మోదీ వస్తారని తెలుసుకున్న నాయక్ మనవడు పార్థ్ నాయక్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంఓ) సంప్రదించారు. "తాత.. మోదీని కలవాలనుకున్నారు. పీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేశాను. ఆశ్చర్యమేంటంటే ప్రధానే స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడారు" అని పార్థ్ నాయక్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు.. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు