PM Modi meeting with CMs: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ జరగనుంది. కొవిడ్ కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, వైద్య సన్నద్ధత వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి రాష్ట్రాలకు పలు సూచనలు చేయనున్నారు.
Modi CMs meeting
ఆదివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్ పరిస్థితిపై మోదీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను నిలువరించేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.