PM Modi mann ki baat: దేశంలో రానున్న పండగలకు సామాగ్రిని స్థానిక మార్కెట్లోనే కొనుగోలు చేయమని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. 'వోకల్ ఫర్ లోకల్' కార్యక్రమంలో భాగంగా.. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ఈ మేరకు 86వ 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కరోనా వేళ శివరాత్రి, హోళీ పండగలను జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.
'పండగల సామగ్రి లోకల్ మార్కెట్లోనే కొంటే వారికి ప్రోత్సాహం' - Pm Mann ki bat
PM Modi mann ki baat: 86వ 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశంలో రానున్న పండగలకు సామాగ్రిని లోకల్ మార్కెట్లో కొనుగోలు చేసి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. 2014 తర్వాత.. భారత్ నుంచి విదేశాలకు స్మగ్లింగ్ గురైన 200కు పైగా విగ్రహాలను తెప్పించామని మోదీ తెలిపారు.
!['పండగల సామగ్రి లోకల్ మార్కెట్లోనే కొంటే వారికి ప్రోత్సాహం' PM Modi mann ki baat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14582478-408-14582478-1645936331568.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ
దేశంలోని అనేక విగ్రహాలు స్మగ్లింగ్‌కు గురయ్యాయని, వాటిని ఇతర దేశాల్లో విక్రయించారని ప్రధాని మోదీ తెలిపారు. 2013 వరకు కేవలం తస్కరించిన 13 విగ్రహాలు మాత్రమే భారత్‌కు తీసుకు వచ్చారని అన్నారు. 2014 తర్వాత.. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల నుంచి 200కు పైగా విగ్రహాలను తెప్పించామని ప్రధాని మోదీ తెలిపారు.