పోరాట యోధులను గౌరవించే విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వీరులకు ఇంతకాలం గౌరవం దక్కకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
ప్రముఖ పోరాట యోధుడు సుహేల్ దేవ్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహ ప్రతిష్ఠకు శంకుస్థాపన చేశారు మోదీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ వంటి నేతలకు తగిన గౌరవం ఇవ్వలేదని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు.
"పోరాట యోధులకు గత ప్రభుత్వాలు తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వలేదు. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. ఆ తప్పులను మా ప్రభుత్వం సరిచేస్తోంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.