ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో (PM Modi in UP) రూ.3,425 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) ప్రారంభించారు. 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3,013 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయడం సహా, గ్రిడ్ స్థిరత్వం కోసం దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 40 వేల చదరపు మీటర్లలో నిర్మించిన అటల్ ఏక్తా పార్క్‌ను మోదీ ప్రారంభించారు.
యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.400 కోట్ల ప్రాజెక్టుకూ భూమిపూజ చేశారు మోదీ. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్‌లను తయారు చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ ప్రాంతంలో ఓ ప్లాంట్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుతో భారత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రధాన కేంద్రంగా బుందేల్‌ఖండ్ మారుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ఆర్మీకి ఆయుధాలు!
ఈ సందర్భంగా.. 'హెచ్ఏఎల్' తయారు చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ను.. భారత వాయుసేనకు అందించారు మోజీ. నావికా దళం కోసం డీఆర్డీఓ డిజైన్ చేసిన అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్తో పాటు అంకుర సంస్థలు తయారు చేసిన డ్రోన్లు/యూఏవీలను సైతం ఆర్మీకి అప్పగించారు.
ఝాన్సీ కోటలో మోదీ..