భారత దేశం 100 కోట్ల డోసుల టీకా పంపిణీ మైలురాయిని(india vaccination count) అందుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిదారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఈ ఘనత సాధించేందుకు దోహదపడిన వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు(pm modi news). కరోనాపై పోరులో దేశ ప్రజలకు 100కోట్ల టీకాల 'సురక్షిత కవచం' లభించిందన్నారు.
దిల్లీ ఎయిమ్స్‌లోని ఎన్సీఐలో (నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్) ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన విశ్రామ్ సదన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు మోదీ. ఈ నేపథ్యంలో టీకా 100కోట్ల మైలురాయి ఘనత ప్రతి ఒక్క భారతీయుడి సొంతమని తెలిపారు.
"100 ఏళ్లల్లోనే అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొనే దిశగా.. దేశానికి 100కోట్ల టీకా రక్షణ లభించింది. ఇది ప్రతి భారతీయుడికి సొంతం."