'గత పాలకులకు యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు' PM Modi kanpur visit: గత పాలకులు నిర్లక్ష్యం వల్లే ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. వారు సొంత ప్రయోజనాల గురించి ఆలోచించారు తప్ప ప్రజల అవసరాలపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు.
యూపీ పర్యటనలో భాగంగా కాన్పుర్ మెట్రో రైలు ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రారంభించారు మోదీ. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.
మెట్రోలో మోదీ, హర్దీప్ సింగ్ పూరి Modi inaugurates kanpur metro
ఐఐటీ కాన్పుర్, మోతీ ఝీల్ను అనుసంధానించే ఈ ప్రాజెక్టు 9కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం 32 కిలోమీటర్లు ఉన్న కాన్పుర్ మెట్రో ప్రాజెక్టును రూ.11,000కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దేశంలో అత్యంత వేగంగా నిర్మించిన మెట్రో ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.
2019 నవంబర్ 15న సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పుర్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు . ఈ ఏడాది నవంబర్ 10న ఐఐటీ కాన్పుర్ నుంచి మోతీ ఝీల్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.
పర్యటనలో భాగంగా బినా-పంకీ మల్టీప్రోడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్టును కూడా మోదీ ప్రారంభించారు.
స్టార్టప్ హబ్‌గా భారత్..
అంతకుముందు ఐఐటీ కాన్పుర్ 54వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్పొన్నారు మోదీ. ఈ కార్యక్రమంలో బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిగ్రీలను ప్రారంభించారు. దేశానికి ఐఐటీ కాన్పుర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా అవతరించిందని చెప్పారు. 75 యూనికార్న్‌లు, 50వేలకుపైగా అంకుర సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో 10వేల సంస్థలు గత ఆరు నెలల కాలంలోనే అవతరించినట్లు గుర్తు చేశారు.
ఇదీ చదవండి:'చరిత్రను కాలరాసి.. దేశ వారసత్వాన్ని చెరిపేందుకు కుట్ర'