భారత్, మారిషస్ మధ్య సముద్రాల భద్రత సహా వివిధ రంగాల్లో సహకారం 'సాగర్'(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) విజన్‌ను అమలులోకి తీసుకొచ్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ సాయంతో నిర్మించిన ఇళ్ల ప్రాజెక్టును ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్తో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. అలాగే.. భారత సహకారంతో చేపట్టిన 8 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, సివిల్ సర్వీసెస్ కళాశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇరుదేశల మధ్య సంబంధాలపై మాట్లాడారు ప్రధాని మోదీ. 2015లో మారిషస్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే సముద్రాల భద్రతకు భారత సహకారంపై 'సాగర్'కు పురుడుపోశారు.
" సముద్రాల భద్రత సహ ఇతర అంశాల్లో మా ధ్వైపాక్షిక సహకారం సాగర్ విజన్‌ను ఆచరణలోకి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. సంస్కృతి, భాష, పూర్వీకుల నడవడిక.. భారత్, మారిషస్ ఒకటేనని చెబుతున్నాయి. ఈరోజు మా బలమైన అభివృద్ధి భాగస్వామ్యం.. ఇరు దేశాల సంబంధాల్లో మూలస్తంభంగా నిలిచింది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.