మార్చి 28న ప్రసారం కానున్న మన్ కీ బాత్ కోసం సలహాలు, సూచనలతో పాటు స్ఫూర్తినిచ్చే తమ విజయగాథల గురించి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని.. 2021లో నిర్వహించబోయే మూడవ మన్ కీ బాత్ ద్వారా ఆసక్తికర విషయాలను.. దేశవ్యాప్తంగా పలువురి విజయాల గురించి దేశ ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
'మన్ కీ బాత్ కోసం సలహాలు ఇవ్వండి' - మన్‌కీబాత్ 2021
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమం కోసం ప్రజలు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ కార్యక్రమం ఈనెల 28న ప్రసారం కానుంది.
మన్ కీ బాత్ కోసం సలహాలు సూచనలు ఇవ్వండి
ఈ మన్‌కీబాత్‌పై విలువైన సూచనలను మైగవ్ లేదా నమో యాప్‌లో పెట్టాలని లేదా మెసేజ్‌ను రికార్డు చేసి పంపాలని కోరారు