తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశానికి కిచిడీ ప్రభుత్వం అవసరం లేదు- జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​ అభివృద్ధికి స్పెషల్​ ప్లాన్​!' - మోదీ లేటెస్ట్ న్యూస్

PM Modi Interview India Today : దేశానికి కిచిడీ ప్రభుత్వం అవసరం లేదని ప్రజలు ఏకాభిప్రాయంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మిలీ జులీ సర్కార్ల వల్ల ఆశావాదం అడుగంటిందనీ, ప్రపంచంలో దేశ ప్రతిష్ఠ మసకబారిపోయిందని పేర్కొన్నారు. మోదీ హామీ అంటే ఎన్నికల్లో గెలిచేందుకు రూపొందించిన సూత్రం కాదనీ అది పేద ప్రజల నమ్మకమని వివరించారు.

PM Modi Interview India Today
PM Modi Interview India Today

By PTI

Published : Dec 30, 2023, 6:49 AM IST

PM Modi Interview India Today : దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశానికి కిచిడీ ప్రభుత్వం (మిలీ-జులీ సర్కార్‌) అవసరం లేదని వారంతా ఏకాభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. అటువంటి ప్రభుత్వాల కారణంగా ఆశావాదం అణగారిపోయిందని, ప్రపంచంలో దేశ ప్రతిష్ఠ మసకబారిపోయిందని ఆరోపించారు. ఇండియా టుడే మ్యాగ్​జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు మోదీ.

"చెప్పాలంటే మోదీ హామీ అనేది ఎన్నికల్లో గెలిచేందుకు రూపొందించిన సూత్రం కాదు. అది పేద ప్రజల నమ్మకం. మోదీ తన విద్యుక్త ధర్మం నుంచి వెనక్కు మరలడని ప్రతి పేద పౌరుడికి తెలుసు. వారికి ఉన్న ఆ నమ్మకమే నాకు శక్తిని మరింత అందిస్తుంది. ఆ కారణంగానే నేను ఎంత అలసిపోయినప్పటికీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయను"

-- నరేంద్ర మోదీ ప్రధానమంత్రి

ఈ శక్తే మోదీ చోదక శక్తి!
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి, జ్ఞాన్‌ (జీవైఏఎన్‌/జీ-పేదలు; వై-యువత; ఏ-అన్నదాత; ఎన్‌-మహిళాశక్తి)పై దృష్టి పెడతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1922 నుంచి 1947 వరకూ 25 సంవత్సరాలపాటు దేశంలోని ప్రతి ఒక్కరు స్వాతంత్య్రం కోసం కృషి చేశారని చెప్పారు. అదే విధంగా దేశ 100 సంవత్సరాల స్వాతంత్య్రోత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఆశావాదంతో ప్రజలు ఉన్నారు పేర్కొన్నారు. ఈ శక్తే తన చోదక శక్తిగా పనిచేస్తోందని వెల్లడించారు.

మూడు రాష్ట్రాల్లో కొత్తవారికి ఛాన్స్ అందుకే!
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్తవారికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడంపై మోదీ తొలిసారి స్పందించారు. తమ పార్టీ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమే అదని మోదీ వెల్లడించారు. దానికి తానే మంచి ఉదాహరణని తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసినప్పుడు తనకు పరిపాలనాపరమైన అనుభవం ఏమీ లేదని, కనీసం తాను ఎమ్మెల్యేను కూడా కాదని వివరించారు.

బీజీపీకి మద్దతులేని ప్రాంతమే లేదు!
అయితే ప్రస్తుతం అనేక పార్టీలు వంశపారంపర్య విధానాల్లో సాగుతున్నాయని మోదీ విమర్శించారు. ఆ కారణంగా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఏర్పడుతోందని ఆరోపించారు. దేశంలో తమ పార్టీకి మద్దతులేని ప్రాంతమే లేదని మోదీ చెప్పారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, 8 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోందని వివరించారు. జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌ల అభివృద్ధికి బహుముఖ విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని మోదీ పేర్కొన్నారు.

'ఇలాంటి ప్రవర్తనతో 2024 ఎన్నికల్లో మరిన్ని సీట్లు కోల్పోతారు'- ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఫైర్

యూట్యూబ్​లో 2 కోట్ల సబ్​స్క్రైబర్లతో మోదీ రికార్డ్- ఎవరికీ అందనంత ఎత్తులో ప్రధాని

ABOUT THE AUTHOR

...view details