ప్రధాన మంత్రి గరీబా కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) లబ్ధిదారులతో వర్చువల్గా సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా హాజరయ్యారు.
కరోనా సంక్షోభ సమయంలో పీఎంజీకేఏవై పథకం ద్వారా లక్షల మంది పేదలు లబ్ధిపొందారని మోదీ అన్నారు. ప్రభుత్వం లక్షల కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించిందని హర్షం వ్యక్తం చేశారు.
"స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రతి ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు రేషన్ అందించాలనే అంశాన్ని లేవనెత్తింది. ఈ మేరకు కొన్ని పథకాలను కూడా తీసుకువచ్చింది. కానీ, దేశంలో పేదలకు పూర్తి స్థాయిలో సాయం అందలేదు. దేశంలో ఆహార నిల్వలు పెరిగాయి.. కానీ, ఆకలితో అలమటించేవారి సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు."