Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌లు సోమవారం వర్చువల్‌గా సమావేశం కానున్న నేపథ్యంలో భారత్‌కు చెందిన 29 పురాతన వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేసింది. శివుడు, విష్ణుమూర్తి అవతారాలు, జైన విగ్రహాలతోపాటు ఇతర అలంకార వస్తువులు వీటిలో ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ క్రీస్తు శకం 9, 10వ శతాబ్దం కాలానికి చెందినవని అధికారులు తెలిపారు. ఈ పురాతన విగ్రహాలు తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని వివరించారు.
Australia Returns India Antiquities