ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు కోయంబత్తూర్లో పర్యటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నైవేలిలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. రూ.8,000 కోట్లతో ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఎన్ఎల్సీఐఎల్కు చెందిన 709 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు.
తిరుప్పూర్, మదురై, తిరుచ్చిరాపల్లిలో నిర్మించిన 4,144 గృహాలను కూడా ఆవిష్కరించారు ప్రధాని. అంతకుముందు.. కోయంబత్తూర్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత చిత్రపటాలకు నివాళులు అర్పించారు.