తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుణె మెట్రో రైల్​ ప్రాజెక్టుకు మోదీ శ్రీకారం.. ట్రైన్​లో ప్రయాణం - మోదీ వార్తలు

PM Modi in Pune: పుణె మెట్రో రైల్​ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం టికెట్టు కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించారు. అంతకుముందు మున్సిపల్​ కార్యాలయంలో శివాజీ మహారాజ్​ విగ్రహం ఆవిష్కరించారు.

PM Modi inaugurates Pune metro rail project
ప్రధాని మోదీ

By

Published : Mar 6, 2022, 12:20 PM IST

Updated : Mar 6, 2022, 12:32 PM IST

PM Modi in Pune: మహారాష్ట్రలోని పుణెలో మెట్రో రైల్​ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం టికెట్టు కొనుగోలు చేసి గర్వేర్​ మెట్రో స్టేషన్​ నుంచి ఆనంద్​ నగర్​ వరకు మెట్రోలో ప్రయాణించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.

మెట్రో రైల్​ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న మోదీ
టిక్కెట్టు కొనుగోలు చేసి స్టేషన్​లోకి వెళ్తున్న మోదీ

రూ.11,400 కోట్లతో మొత్తం 32.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన 12 కిలోమీటర్లను ప్రారంభించారు మోదీ. ఈ ప్రాజెక్టుకు 2016, డిసెంబర్​ 24న శంకుస్థాపన చేశారు ప్రధాని.

మెట్రోలో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణం
పుణె మెట్రో

శివాజీ మహారాజ్​ విగ్రహం ఆవిష్కరణ

పుణె మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీ.. పుణె మున్సిపల్​ కార్పొరేషన్​ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని 1,850 కిలోల గన్​మెటల్​తో 9.5 అడుగుల ఎత్తుతో తయారు చేశారు.

శివాజీ మహరాజ్​ విగ్రహం ఆవిష్కరిస్తున్న మోదీ
శివాజీ మహారాజ్​ విగ్రహం వద్ద మోదీ
శివాజీ మహారాజ్​ విగ్రహాన్ని మోదీకి అందిస్తున్న నేతలు

అలాగే.. సామాజిక సంస్కర్త మహాత్మ జోతిబాపూలే విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు మోదీ. అంతకుముందు లెహెగావూన్​ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి.. మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, రాష్ట్ర మంత్రి సుభాష్​ దేశాయ్​, దేవేంద్ర ఫడణవీస్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ స్వాగతం పలికారు.

కాంగ్రెస్​, ఎన్​సీపీ నిరసన..

ప్రధాని మోదీ పుణె పర్యటన నేపథ్యంలో అధికార కాంగ్రెస్​, ఎన్​సీపీ పార్టీలు బాబాసాహెబ్​ అంబేడ్కర్​ మెమోరియల్​ వద్ద శాంతియుత నిరసన తెలిపాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి, మహాత్మాగాంధీ సూక్తులతో ఉన్న ప్లకార్డులతో నినాదాలు చేశారు నేతలు. పుణె ప్రజలను ప్రధాని మోదీ.. ఉప ఎన్నికలతో మోసగించారని ఆరోపించారు ఇరు పార్టీల నేతలు. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీకి ఉక్రెయిన్​లోని విద్యార్థులపై ఆందోళన లేదన్నారు. కానీ, పూర్తికాని మెట్రోను ప్రారంభించేందుకు సమయం ఉంటుందని విమర్శించారు.

ఆందోళన చేస్తున్న కాంగ్రెస్​, ఎన్​సీపీ నేతలు, కార్యకర్తలు

ఇదీ చూడండి:కాశీ విశ్వనాథుడి సన్నిధిలో 'డమరుకం' మోగించిన మోదీ​

Last Updated : Mar 6, 2022, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details