కరోనాను కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రెండో దశ వ్యాప్తిని అడ్డుకున్న తీరు శ్లాఘనీయం అని పేర్కొన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు అవకాశం లేకుండా అభివృద్ధికే యూపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గురువారం వారణాసి పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
"ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు అవుతున్నాయి. మాఫియా, తీవ్రవాదం అదుపులోకి వచ్చాయి. మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడాలనుకునే వారికి.. తాము తప్పించుకోలేమని స్పష్టం అయింది. అవినీతికి అవకాశం లేకుండా అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. కొత్త పెట్టుబడులు రావడం సహా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉత్తర భారతానికి కాశీ అతిపెద్ద మెడికల్ హబ్‌గా ఏర్పడనుంది. కాశీలో ఇప్పుడు అన్ని రకాల వ్యాధులకు మెరుగైన చికిత్స అందుతోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని
1500 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం..