తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లంకలోని తమిళుల హక్కుల పరిరక్షణకు కృషి' - ప్రధాని మోదీ తమిళనాడు

తమిళనాడు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని తమిళుల హక్కులకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై అక్కడి ప్రభుత్వంతో రాజ్యాంగబద్ధంగా చర్చిస్తున్నట్టు వెల్లడించారు. పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు మోదీ.

PM Modi in poll bound Tamil Nadu
తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన

By

Published : Feb 14, 2021, 12:19 PM IST

Updated : Feb 14, 2021, 2:02 PM IST

శ్రీలంకలోని తమిళులకు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం దక్కే విధంగా కృషి చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమిళుల హక్కులపై శ్రీలంకతో రాజ్యాంగబద్ధంగా చర్చిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో తమ ప్రభుత్వ కృషి కారణంగా.. శ్రీలంక కస్టడీలో ఒక్క భారతీయ మత్స్యకారుడు కూడా లేడని.. 313 పడవలనూ ఆ దేశ ప్రభుత్వం విడిచిపెట్టిందని పేర్కొన్నారు.

తమిళనాడులో పర్యటించిన ప్రధాని.. చెన్నై నెహ్రూ స్టేడియం వేదికగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టారు. ప్రపంచ దేశాల చూపు భారత్​వైపు ఉందని.. ఈ దశాబ్దం భారతీయులదేనని పేర్కొన్నారు. వారి శ్రమే ఇందుకు కారణమవుతుందన్నారు.

నీటి సంరక్షణ ఆవశ్యకతను గుర్తుచేశారు మోదీ. ఈ క్రమంలో తమిళనాడు రైతులపై ప్రశంసల వర్షం కురిపించారు. నీటి వనరులను సరిగ్గా వినియోగించుకుని.. రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలను ఉత్పత్తి చేశారని కొనియాడారు.

అమరవీరులకు నివాళి...

పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరవీరులకు నివాళులర్పించారు మోదీ. దేశ భద్రతా దళాలపై తమకెంతో గౌరవం ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు.. అమరవీరుల ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.

"ఈ రోజును ఏ భారతీయుడూ మరచిపోలేడు. రెండేళ్ల క్రితం, ఈ రోజున పుల్వామా దాడి జరిగింది. అమరవీరులకు నివాళులు. మన భద్రతా దళాల ధైర్యసాహసాలు చూసి గర్వంగా ఉంది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకం."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అభివృద్ధి పనులకు శ్రీకారం...

పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మోదీ. ఇటీవలే విస్తరించిన చెన్నై మెట్రో లైను సహా చెన్నై బీచ్-అత్తిపట్టు మధ్య ఏర్పాటు చేసిన రైల్వే లైనును ప్రారంభించారు.

అనంతరం ఐఐటీ మద్రాస్​లోని డిస్కవరీ క్యాంపస్​కు శంకుస్థాపన చేశారు మోదీ. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన ఎమ్​కే-1ఏ(అర్జున్​ మైన్​ యుద్ధ ట్యాంకర్​)ను సైన్యాధిపతి ఎమ్​ఎమ్​ నరవణేకు అందించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం పాల్గొన్నారు.

ఇదీ చూడండి:-48 అడుగుల కేక్​తో బేకరీ 'రామ సందేశం'

Last Updated : Feb 14, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details