తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా.. భారత్​- రష్యా​ బంధం సుదృఢం'

Modi Putin Meet: ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా.. భారత్​, రష్యా సంబంధాలు స్థిరంగా, బలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సహకారం మున్ముందు కొనసాగుతుందని ఆకాంక్షించారు.

Indo Russia summit
భారత్​ రష్యా సమ్మిట్​

By

Published : Dec 6, 2021, 7:05 PM IST

Updated : Dec 6, 2021, 10:06 PM IST

Modi Putin Meet: భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్​, రష్యా 21వ వార్షిక సదస్సులో భాగంగా.. దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో సమావేశమయ్యారు.

అంతకుముందు పుతిన్​కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

మోదీ- పుతిన్​ ఆలింగనం

భారత్​- రష్యా మధ్య దృఢమైన బందం ఉందని, భారత్​కు రష్యా ఓ నమ్మదగిన భాగస్వామి అని అన్నారు మోదీ. భారత్​తో రష్యా సంబంధాలు పెట్టుకోవాలని చూస్తుందనడానికి.. పుతిన్​ పర్యటనే అద్దం పడుతోందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ పరీక్షలు, తయారీ సహా మహమ్మారికి సంబంధించిన అన్ని అంశాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం అద్భుతంగా ఉందని మోదీ ప్రశంసలు కురిపించారు.

సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌తో పాటు మానవతా సహాయంలో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయని నరేంద్ర మోదీ గుర్తుచేశారు.

భారత్​ రష్యా సమ్మిట్​

''దశాబ్దాలుగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారాయి. కానీ.. రష్యా- భారత్​ స్నేహం మాత్రం అలానే ఉంది. వ్యూహాత్మక ప్రత్యేక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుంది.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

భారత్​ను గొప్ప శక్తిగా భావిస్తున్నట్లు తెలిపిన పుతిన్​.. ఇరు దేశాల బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

'ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ గతేడాది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17 శాతం తగ్గింది. అయినప్పటికీ ఈ ఏడాది తొలి తొమ్మిది మాసాల్లోనే అది 30 శాతం పెరిగింది. ఇంధనం, అంతరిక్ష రంగంలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి. వీటితో పాటు మిలిటరీ, సాంకేతిక రంగాల్లోనూ పూర్తి సహకారంతో కలిసి ముందుకెళ్తున్నాం' అని పుతిన్‌ పేర్కొన్నారు.

ఉగ్రవాదం, డ్రగ్స్​ అక్రమ రవాణాపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపిన పుతిన్​.. వీటికి వ్యతిరేకంగా కలిసి పోరాడదామని చెప్పారు. అఫ్గానిస్థాన్​లోని పరిస్థితులపై కూడా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.

28 ఒప్పందాలు..

భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడి మధ్య చర్చలు పూర్తి ఫలప్రదంగా సాగాయని చెప్పారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. భారత్​కు రావాలన్న నిర్ణయం.. ద్వైపాక్షిక సంబంధాలపై పుతిన్​ ప్రాముఖ్యతను తెలియజేస్తోందని పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య 28 ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:నాగాలాండ్​ కాల్పులపై షా విచారం- అసలేమైందో సవివరంగా చెప్పిన మంత్రి

Last Updated : Dec 6, 2021, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details