తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ మంత్రుల పనితీరుపై మోదీ సమీక్ష! - కేబినెట్​ విస్తరణ

పలువురు కేంద్ర మంత్రులతో మరోమారు భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో మంత్రుల పనితీరుపై సమీక్షించేందుకే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసింది.

PM Modi
నరేంద్ర మోదీ

By

Published : Jun 20, 2021, 2:31 PM IST

కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు భేటీ అయ్యారు. లోక్​ కల్యాణ్​ మార్గ్​లోని ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, పీయూష్​ గోయల్​ హాజరయ్యారు.

త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని నిర్వహిస్తున్న వరుస సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెలలోనే ఇప్పటి వరకు కేంద్ర మంత్రులతో ఐదుసార్లు సమావేశమయ్యారు మోదీ. ఆయా సమావేశాల్లో మంత్రుల పనితీరును సమీక్షించినట్లు తెలుస్తోంది.

ఆదివారం జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ.. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుల నేపథ్యంలోనే జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయా మంత్రుల పనితీరు ప్రకారం.. శాఖల మార్పు లేదా ఉద్వాసన పలికే అవకాశాలూ లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:త్వరలో మోదీ కేబినెట్ విస్తరణ- కీలక నేతలకు చోటు!

ABOUT THE AUTHOR

...view details