తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Modi: 'కార్యదర్శుల్లా కాదు.. నాయకుల్లా వ్యవహరించండి' - కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). తమ బృందాలకు.. కార్యదర్శుల్లా కాకుండా నాయకుల్లా వ్యవహరించాలని సూచించారు.

PM Modi
నరేంద్ర మోదీ

By

Published : Sep 19, 2021, 5:45 AM IST

కేంద్ర ప్రభుత్వ విభాగాల సెక్రటరీలు.. కార్యదర్శుల్లా కాకుండా, తమ బృందాలకు నాయకులుగా వ్యవహరించాలని ప్రధాని మోదీ (PM Modi) ఉద్బోధించారు. శనివారం నాలుగు గంటలకు పైగా వారితో ఆయన సమావేశమయ్యారు. అభివృద్ధి దిశగా ముందడుగు వేసేందుకు అధికారులకు మంచి ఆలోచనలున్నా.. వాటిని ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నారన్న విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

"విధానపరమైన అంశాలపై చాలా మంది కార్యదర్శులు తమ అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు. పాలనను మరింత మెరుగుపరిచి ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. ఈ ఆలోచనలు చాలా బాగున్నాయని మోదీ ప్రశంసించారు. అయితే, వాటిని ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నారని అడిగారు. కార్యదర్శులుగా కాకుండా, తమ బృందాలకు నాయకులుగా వ్యవహరించాలని వారికి సూచించారు" అని ఆ వర్గాలు వివరించాయి.

ఇదీ చూడండి:ఫిబ్రవరి 5న సమతామూర్తిని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details