భారత వైమానిక దళ 89వ వార్షికోత్సవాన్ని(Air Force Day 2021) పురస్కరించకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ.. మానవతా సేవలోనూ భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని మోదీ ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
"వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వాయుసేన యోధులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత వైమానిక దళం.. ధైర్యసాహసాలు, శ్రద్ధ, నైపుణ్యాలకు పర్యాయపదం. దేశాన్ని రక్షించడమే కాకుండా.. విపత్కర పరిస్థితుల్లో మానవతా సేవలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు."
- ప్రధాని నరేంద్ర మోదీ
భారత వాయుసేన దినోత్సవం నాడు (Indian air force day 2021) వైమానిక సిబ్బంది, వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు రాష్ట్రపతి కోవింద్.
"వైమానిక దినోత్సవం సందర్భంగా వైమానిక యోధులు, అనుభవజ్ఞులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. శాంతి, యుద్ధ సమయంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న భారత వైమానిక దళం పట్ల దేశం గర్వపడుతుంది. ఐఏఎఫ్ తన ప్రతిష్టాత్మకమైన అత్యుత్తమ ప్రమాణాలను కొనసాగిస్తుందని నేను భావిస్తున్నాను."
- రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్