దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గురువారం పండుగల సందడి నెలకొనడంతో ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తమిళ ప్రజలకు పొంగల్, అసోం ప్రజలకు మాఘ్ బిహు, గుజరాతీలకు ఉత్తరాయన్, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు.
'భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం భారతదేశం వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. మన సంప్రదాయాలు ఏర్పాటు చేసిన చైతన్యాన్ని గుర్తుకుతెస్తాయి. తల్లి లాంటి ప్రకృతిని గౌరవించడాన్ని ఈ పండుగ ప్రోత్సహిస్తుంది' అని ప్రధాని పేర్కొన్నారు.