తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ మోదీనే నంబర్​ వన్​.. ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 78 శాతం ప్రజామోదం ఉందని 'మార్నింగ్‌ కన్సల్ట్‌' అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అత్యధిక రేటింగ్‌ సంపాదించుకున్నారు.

pm modi gets most popular global leader in survey 2023
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశాధినేత.. మోదీ

By

Published : Feb 4, 2023, 5:37 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాధినేతల సర్వేలలో తన అధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ గ్లోబల్ లీడర్‌ అప్రూవల్‌ పేరుతో దేశాల్లో నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీని 78శాతం మంది ప్రజలు ఆమోదించారు. 68 శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా అధినేత జోబైడెన్‌ ఈ సంవత్సరం ఒక స్థానం దిగజారి 40 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల అధినేతలపై జరిపిన సర్వేలో నార్వే ప్రధాని జోనాస్‌ గహర్‌ 21 శాతంతో చిట్టచివరి స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్ యుల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వరుసగా 20,21 స్థానాల్లో ఉన్నారు. ఇటలీకి కొత్తగా ఎన్నికైన తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోని 52 శాతం ప్రజామోదంతో 6వ స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో నిలిచారు. బ్రెజిల్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతం ఆమోదంతో 5వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదంతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ప్రజామోదంతో 12వ స్థానాన్ని సంపాదించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details