దేశంలోని మహిళలు సాధించిన అనేక విజయాలు భారత్కు గర్వకారణంగా నిలిచాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విస్తృత రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించేందుకు పనిచేసే అవకాశం దొరకడం తమ ప్రభుత్వానికి గౌరవప్రదం అని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
"అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎవరికీ తలవంచని మహిళలకు వందనం! దేశ అతివలు సాధించిన అనేక విజయాలతో భారత్ గర్విస్తోంది. విస్తృత రంగాలలో మహిళా సాధికారతను పెంపొందించే దిశగా పనిచేసే అవకాశాన్ని పొందడం మా ప్రభుత్వానికి గౌరవప్రదం."