తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిల్కాకు ప్రధాని, రాష్ట్రపతి నివాళి - మిల్కా సింగ్​కు మోదీ నివాళి

మిల్కా సింగ్ మృతి పట్ల యావత్ భారతం.. ఘన నివాళులు అర్పిస్తోంది. మిల్కా మరణం తన హృదయాన్ని దుఃఖంతో నింపేసిందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తెలిపారు.

Milkha Singh dies
మిల్కా సింగ్ కన్నుమూత

By

Published : Jun 19, 2021, 4:43 AM IST

భారత లెజండరీ స్ప్రింటర్​ మిల్కా సింగ్ (91) కన్నుమూతపట్ల రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మిల్కా తుది శ్వాస విడిచారు.

బలమైన వ్యక్తిత్వం..

రాష్ట్రపతి కోవింద్ నివాళి

మిల్కా మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మిల్కా మరణం నా హృదయాన్ని దుఃఖంతో నింపేసింది. జీవితంలో మిల్కా ఎదుర్కొన్న కష్టాలు, ఆయన బలమైన వ్యక్తిత్వం.. భారత్​లో అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి." అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ఎందరికో స్ఫూర్తి..

ప్రధాని మోదీ సంతాపం

"దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది. కోట్లాది మంది హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

చిరస్మరణీయం..

హోంమంత్రి అమిత్ షా ట్వీట్

మిల్కా మరణం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తంచేశారు. "ప్రపంచ అథ్లెటిక్స్​లో మిల్కా సింగ్.. చెరగని ముద్ర వేశారు. దేశంలోనే గొప్ప క్రీడాకారునిగా భారత్​ ఎల్లప్పుడు ఆయనను స్మరిస్తుంది." అని అమిత్ షా ట్వీట్ చేశారు.

తారను కోల్పోయాం..

కిరణ్ రిజుజు ట్వీట్

మిల్కా మృతి పట్ల కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. "మేము మీ చివరి కోరికను నెరవేరుస్తాం. భారతదేశం.. తారను కోల్పోయింది. ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయినా.. ప్రతి భారతీయుడు దేశ కీర్తి కోసం శ్రమించేలా స్ఫూర్తినిస్తూనే ఉంటారు." అని రిజుజు అన్నారు.

ఎన్ని తరాలైనా మరువం..

పంజాబ్ సీఎం అమరీందర్ సంతాపం

మిల్కా మరణం పట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. "ఒక శకం ముగిసింది. భారత్​, పంజాబ్​కు తీరని నష్టం జరిగింది. ఎన్ని తరాలైనా ఆయన ఘనతలను దేశం స్మరిస్తూ ఉంటుంది." అని అమరీందర్ ట్వీట్ చేశారు.

క్రీడా ఆణిముత్యం

మిల్కా సింగ్

1932 నవంబర్‌ 20న పంజాబ్‌ (పాకిస్థాన్‌) గోవింద్‌పురలోని సిక్‌ రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో మిల్కాసింగ్‌ జన్మించారు. భారతదేశ క్రీడా ఆణిముత్యంగా కీర్తి గడించారు. పరుగు పోటీల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో బ్రిటీష్‌ ప్రభుత్వం, కామన్‌వెల్త్‌ పోటీల్లో అరుదైన ఘనత సాధించారు. 46.6 సెకన్లలో 440 యార్డ్స్‌ పరుగెత్తి స్వర్ణం గెలిచిన మిల్కా.. భారత్ తరపున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 1959లో కేంద్ర ప్రభుత్వం మిల్కాసింగ్‌కు పద్మశ్రీ ప్రదానం చేసింది. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం 'బాగ్‌ మిల్కా బాగ్‌'. మిల్కా సతీమణి నిర్మల్‌ కౌర్‌ గతవారం కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇదీ చూడండి:పరుగుల ఉల్క.. 90వ పడిలో మిల్కా

ABOUT THE AUTHOR

...view details