తమిళనాడు అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని నొక్కిచెప్పారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర అభివృద్ధి కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.5.42 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రాష్ట్రానికి నిధులు కేటాయించటంలో అలసత్వం ప్రదర్శించాయని విమర్శలు చేశారు.
తమిళనాడు పర్యటనలో భాగంగా పొంగల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు నడ్డా. తమిళనాడులో అమలవుతోన్న కేంద్ర పథకాల ప్రయోజనాలను వివరించారు.
" తమిళనాడు గొప్ప సంస్కృతికి, ఆధ్యాత్మికతకు నిలయం. మత గురువులు, నాయకుల ఆధ్వర్యంలో మతపరమైన భావాలను కాపాడుతున్న రాష్ట్రం. పొంగల్ ఉత్సవాలను జరుపుకొనేందుకు ఇక్కడికి రావటం నాకు గొప్ప విజయం. ఇది రైతుల పండగ. యావత్ దేశం మొత్తం జరుపుకొంటోంది. తమిళనాడులో దీనికి ప్రత్యేక నిర్వచనం ఉంది. మత గురువులకు రాష్ట్రం కేంద్రం.