తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి'

PM Modi education webinar: దేశంలోని చాలా రాష్ట్రాలు వైద్య, సాంకేతిక కోర్సులను మాతృభాషల్లోనే బోధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మాతృభాషలో బోధన చిన్నారుల మానసిక వికాసానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన వెబినార్​ను ఉద్దేశించి ఈ మేరకు ప్రసంగించారు.

narendra modi
మోదీ వెబినార్

By

Published : Feb 21, 2022, 12:09 PM IST

PM Modi education webinar: మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందని చెప్పారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు.

Narendra Modi Education webinar

బడ్జెట్​లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపై.. కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన వెబినార్​లో ప్రసంగించిన మోదీ... విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం.. విద్యా రంగంలో అపూర్వ ఘట్టమని అభివర్ణించారు.

వెబినార్​లో మోదీ

"సార్వత్రిక నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, దేశంలోని యూనివర్సిటీలను ప్రపంచ స్థాయిగా తీర్చిదిద్దడం, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్(ఏవీజీసీ).. వంటి విషయాలపై ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ-విద్య, వన్ క్లాస్ వన్ ఛానెల్, డిజిటల్ ల్యాబ్స్, డిజిటల్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలు యువతకు ఉపయోగపడతాయి. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా కరోనా సమయంలోనూ విద్యా వ్యవస్థ అంతరాయాలు లేకుండా కొనసాగింది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ వెబినార్​కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు, విద్యార్థులు హాజరయ్యారు. డిజిటల్ యూనివర్సిటీ, డిజిటల్ టీచర్, అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ వంటి తదితర ఇతివృత్తాలతో వెబినార్​లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

ABOUT THE AUTHOR

...view details