తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీకి మోదీ ఫోన్​- ఆదుకుంటామని హామీ

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ చేసి వరద నష్టంపై వివరాలు కనుక్కున్నారు. విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

west bengal floods
బంగాల్​లో వరదలు

By

Published : Aug 4, 2021, 3:22 PM IST

Updated : Aug 4, 2021, 11:05 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫోన్​లో బుధవారం మాట్లాడారు. బంగాల్​లో వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

"బంగాల్​లో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఎదుర్కోనేందుకు.. కేంద్ర నుంచి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు."

-ప్రధాన మంత్రి కార్యాలయం.

హావ్​డా జిల్లాలోని ఉదయ్​నారాయణ్​పుర్​లో వరద ప్రభావిత ప్రాంతాలను మమత సందర్శిస్తున్న మోదీ నుంచి ఫోన్ కాల్​ వచ్చిందని ఓ అధికారి తెలిపారు. వరదల పరిస్థితిపై కేంద్రానికి నివేదికను అందజేస్తామని మోదీతో దీది చెప్పినట్లు పేర్కొన్నారు.

హావ్​డా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మమతా బెనర్జీ
వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్న సీఎం మమతా బెనర్జీ
స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న మమతా బెనర్జీ

బంగాల్​లో వరదల ధాటికి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు దామోదర్​ లోయ ప్రాంతంలోని ఆనకట్టల నుంచి పోటెత్తిన వరదల కారణంగా ఆరు జిల్లాలకు చెందిన 3 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.

పరిహారం..

బంగాల్​లో వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్​ఆర్​ఎఫ్​) నుంచి రూ.2 లక్షల పరిహారాన్ని అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గాయపడ్డవారికి రూ.50,000 ఇవ్వనున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి:అధ్వానంగా రోడ్లు.. సంగీతంతో సందేశం

ఇదీ చూడండి:హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా రాహుల్!

Last Updated : Aug 4, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details