PM Modi Dedicated NTPC Power Project to Nation in Nizamabad : పెద్దపల్లి జిల్లాలోని సూపర్ థర్మల్ పవర్ ప్లాంటు(NTPC Power Plant)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీజాతికి అంకితం చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభ(BJP Public Meeting in Nizamabad) వేదిక నుంచి ఈ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం సభావేదిక పైనుంచే పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అలాగే మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్‌ను సైతం లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత పీఎం మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దపల్లిలో అత్యాధునిక సూపర్ పవర్ థర్మల్ విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. 2016లో శంకుస్థాపన చేసి.. ఇప్పుడు ఇంత త్వరగా ప్రారంభించుకున్నామని.. ఇదీ తమ ప్రభుత్వ పని సంస్కృతి అని వ్యాఖ్యానించారు. అలాగే త్వరలోనే రెండో యూనిట్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని
PM Modi Public Meeting in Nizamabad : ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ధర్మాబాద్-మనోహరాబాద్-మహబూబ్‌నగర్-కర్నూలు లైను విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కోసమే బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి, డీకే అరుణ, అర్వింద్, బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
PM Modi Tour in Nizamabad Today :బీజేపీ నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభకు భారీగా ప్రజలు, పసుపు రైతులు తరలివచ్చారు. సభావేదిక వద్ద రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మోదీకి 600 మంది మహిళలు స్వాగతం పలకనున్నారు. అంతకు ముందు డీకే అరుణ, కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు.
PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం'
PM Modi Mahabubnagar District Tour : మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,500 కోట్ల విలువైన పనులకు శ్రీకారం