తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంగ్​సాన్​ సూకీకి మోదీ అభినందనలు

మయన్మార్​ ఎన్నికల్లో గెలుపొందిన నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్​సాన్​ సూకీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మైత్రి మరింత బలోపేతం కావాలని ట్విట్టర్​ వేదికగా ఆకాంక్షించారు.

PM Modi congratulates Myanmar's Aung San Suu Kyi over her party's election win
ఆంగ్​సాన్​ సూకీకి మోదీ అభినందనలు

By

Published : Nov 13, 2020, 6:00 AM IST

నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఆంగ్​సాన్​ సూకీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మయన్మార్​ ఎన్నికల్లో ఆమె పార్టీ నేషనల్​ లీగ్​ ఫర్​ డెమొక్రసీ(ఎన్​ఎల్​డీ) గెలుపొందిన నేపథ్యంలో ప్రధాని ట్వీట్​ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

అనధికారిక గణాంకాల ప్రకారం.. పార్లమెంటులో మెజారిటీ సీట్లను ఎన్​ఎల్​డీ గెల్చుకుంది. ఫలితంగా.. మరో ఐదేళ్లు సూకీ మయన్మార్​ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

మోదీ ట్వీట్​

''ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ఆంగ్​సాన్​ సూకీ, ఎన్​ఎల్​డీకి అభినందనలు. ప్రస్తుత పరిస్థితుల్లో మయన్మార్​లో ఎన్నికలను నిర్వహించడం గొప్ప విషయం. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా''

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఈ ఎన్నికల్లో 90కి పైగా పార్టీలు పోటీపడ్డాయి. 3.7 కోట్ల మంది వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వారిలో 50 లక్షల మంది యువ ఓటర్లే.

2015లో ఆమె నేతృత్వంలోని ఎన్​ఎల్​డీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న సైనిక పాలనకు తెరదించింది.

ABOUT THE AUTHOR

...view details